https://youtu.be/gvKmVCDSSx0?si=Qd_gDJh1b1403bM9
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:ఖమాస్
అందాలకు లోగిళ్ళు అరవిరిసిన ఆ కళ్ళు
ఎంతగా చూసినా తీరవు నా చూపుల ఆకళ్ళు
కళ్ళు కళ్ళతో కలిపామా వేస్తాయి సంకెళ్ళు
అప్సరసల మనోహర నేత్రాల కవి నకళ్ళు
1.అలవోకగ చూసినపుడు అల్లనేరేడు పళ్ళు
క్రీగంట చూస్తేనో కొంటె కోణంగులా జంట మీనాలు
అబ్బురాన విప్పారితె తామర పువు రేకులు
రెప్పలల్లార్చినపుడు తళుకుమనే తారకలు
2.నవరసాల నొలికించే అభినయ తారలు
విశ్వభాష పలికించే అపురూప యానకాలు
ఎన్నటికీ ఎండిపోని గుండె ఊట బావులు
ఇరు మనసుల కలిపేటి వింతైన వంతెనలు
No comments:
Post a Comment