Friday, December 23, 2022

 

https://youtu.be/kzXe_IQJ19I?si=AF9bX8SpTtBZnA6z

29) గోదాదేవి ఇరవై తొమ్మిదవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం

దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:షణ్ముఖప్రియ


వేగుచుక్క పొడవగనే

వేకువనకు మునుపుననే

చేరవచ్చినాము నీ పదసన్నిధికి

పాటపాడుతున్నాము నీ సుప్రభాత సేవకి

మేలుకోరా శ్రీనాథా శ్రీరంగనాథా

మా మేలుకోరే గోకుల గోపీనాథా


1.యాదవుల ఇంటిలో నీ సామాన్య జీవనము

గోవులకాచే గొల్లపిల్లవాడిగా సాగే నీవే ఆదర్శము

కొంటెచేష్టలు కోణంగి ఆటలు మామూలుగా మనడము

అంతలోనె వింతగొలుపు లీలలతో నీ శౌర్యమే ఆశ్చర్యము

మేలుకోరా నందనందనా మందస్మిత వదనా

మా మేలుకోరే యశోదా కిశోరా మురళీధరా


2.అన్యథా శరణం నాస్తి మాకీవే శరణాగతి

నీ దాసాను దాసులకు సైతం మా పబ్బతి

నిరంతము నిన్నే తలవనీ చెలఁగెడి మా మతి

మా మనోకామన లీడేర్చి మము  చేర్చుము సద్గతి

మా నోము ఫలమే పరమార్థ సాధనము

మమ్మేలుకొనగ మేలుకో గోవిందా అనుదినము

No comments: