Tuesday, January 24, 2023

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


ప్రతి భంగిమ ఒక మదన సంచిక

పడతి ప్రతికదలిక మలయవీచిక

ప్రణయోద్దీపకగా ప్రమద అష్టవిధ నాయిక

రాసకేళి మార్గదర్శికగా రమణి రమ్య వైణిక


1.కుచ్చిళ్ళను పెకెత్తి గోదాట్లో కాళ్ళకడుగు వేళ

లేత తమలపాకులా పాదాల మంజీరాలే కళకళ

కొంగును నడుము దోపి చంక నీటి బిందెనెట్టి

తడిపొడిగా తనువే వయారాలతో ఊగే పుట్టి


2.వాకిట ముగ్గునెట్టు తరుణాన వలపుల తరుణీ 

వాలే ముంగురులను ఎగదోస్తూ ఓ ఇంద్ర నీలమణి

పూజకు పూలుకోస్తూ కొసకొమ్మకు ఎగిరే ఎలనాగ

దాగిన అందాలే కనువిందుచేయు షడ్రసోపేతగా


3.కురులార బెట్టకొని చిక్కులు తొలగించుకొనే చిగురుబోడి

పురుష పుంగవుల కెవరికైనా రేపును ఒంటిలోన వేడి

చతుర్విధ జాతుల కలబోతగా తలపించును అర్ధాంగి

షట్కర్మయుక్తగా మగని బ్రతుకున అడుగుడుగున శుభాంగి

No comments: