Tuesday, January 17, 2023



https://youtu.be/cNa4NNVwFXE?si=zrSX9puZDwMojfik

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


చినుకు పలకరిస్తుంది-గాలి అనునయిస్తుంది

పువ్వుసైతం రువ్వుతుంది-ఓ నవ్వు నా కోసం  

నీకేలనే చెలీ నేనంటే ఇంత ఉదాసీనం

చంపివేయి ఒక్కసారే సైచలేను నీ మౌనం


1.నేనంటూ ఉన్నానని అసలు గుర్తించవు

నేనంటూ ఉంటానని ఏ మాత్రం గుర్తుంచుకోవు

నా అంతట నేనే చొరవతీసుకుంటా కలవడానికి

పట్టిపట్టి నీతో మాటకలుపుతాను దగ్గరవడానికి

దాటవేస్తుంటావు కుంటిసాకులెన్నో చెప్పి

మాటమార్చుతుంటావు మరులనే గుప్పి


2.ప్రణాళికలు రచించాలి నీ అందం చూడడానికి

ప్రయత్నాలు ఫలించాలి నిమిషమైన గడపడానికి

గుడిలోని దేవత సైతం ఇస్తుంది దివ్యదర్శనం

నా దేవిగా ఆరాధించినా ప్రసాదించవేల వరం

ఎలా చేసుకోను నిన్ను అనునిత్యం ప్రసన్నం

నీవు లేని నా బ్రతుకే అత్యంత అధ్వాన్నం

No comments: