Tuesday, January 17, 2023

 https://youtu.be/mZtfpa_i5hQ


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:పుష్పలతిక


దయా హృదయవీవు

సామ ప్రియ శారదవు

కఛ్ఛపి వీణా వాదన వైశిష్ట్యవు

మంజుల మంద్రస్వర సంతుష్టవు

ప్రణతులివే ప్రణవీ మా ఇష్ట దేవతవు

మా మతిలో కృతిలో భారతీ నీవే కలవు


1.శ్వేత పద్మాసిని శ్వేతాంబరధారిణి

హంసవాహిని ప్రశాంత రూపిణి

చంద్రానన వాణీ సుమధుర హాసిని

ప్రణతులివే ప్రణవీవే మా ఇష్ట దేవతవు

మా మతిలో కృతిలో భారతీ నీవే కలవు


2.సప్త స్వర మాతృక సప్త వర్ణాత్మిక

సప్త జ్ఞాన భూమిక సప్తచక్రోద్దీపిక

సప్త జన్మ కృత దోష పీడా హారిక

ప్రణతులివే ప్రణవీవే మా ఇష్ట దేవతవు

మా మతిలో కృతిలో భారతీ నీవే కలవు

No comments: