రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
ఉగ్ర నారసింహా యోగనారసింహా
ధర్మపురీ లక్ష్మీనరసింహా
ఏ దేవుడు లేడు ధరలో నీ తరహా
దూరాల భక్తులకు నీవు కల్పవృక్షము
మాఊరి దాసులకు ఎప్పటికిక మోక్షము
1.దీపం క్రిందే స్వామీ చీకటటా
నీపదముల కడ మేముంటిమి అకటా
కుదరదాయే మాపై నీదృష్టి సారించుట
తప్పించుము సత్వరమే మా కటకట
2.ఇంటి చెట్టు మన మందుకు పనికిరాదట
నీ వరములు కనికరములు మందికేనట
దగ్గరి వారమంటె నరహరి నీకైతే అలుసట
నిను వేడివేడి చాన్నాళ్ళుగ పొందితిమి అలసట
No comments:
Post a Comment