https://youtu.be/oMcgAGVGonU
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
రాగం:పీలూ
పౌష్యలక్ష్మి నీకుమా హార్దిక స్వాగతం
ధాన్యలక్ష్మి నీదయతోనే మా జీవితం
మకర సంక్రాంతి లక్ష్మి మంజుల మానస లక్ష్మీ
ఏతెంచును నీతోనే భువిన ఉత్తరాయణం
మేమర్పింతుము పితరులకు తిల తర్పణం
సంకురాతిరి పండుగ మా సంతోష కారణం
1.పాడీ పంటలతో నిండును మా గాదెలు
పిల్లాపాపల సందడితో పండును మా కలలు
అంబరాన ఎగురును రంగురంగుల పతంగులు
పందాలు పరాచికాలు విందులు వినోదాలు
సంబరము సంరంభము సయామీ కవలలు
సంకురాతిరి పండుగ మా సంతోష కారణం
2.భోగి మంటలు పిండి వంటలు కొత్త జంటలు
సకినాలు చెవోడీలు జంతికలు లడువాలు
రంగవల్లులు రథం ముగ్గులు పల్లె పడుచుల సిగ్గులు
డూడూ బసవలు రంగని తలచే హరిదాసులు
బంతులు చామంతులు ఇంతుల కనుమ నోములు
సంకురాతిరి పండుగ మా సంతోష కారణం
OK
*సంక్రాంతి శుభాకాంక్షలు*
No comments:
Post a Comment