https://youtu.be/bVmIYC8SyAM?si=C8wuyqVFFOyqYG9_
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
చిచ్చు పెడుతోందే పెదవిమీది పుట్టుమచ్చ
రెచ్చగొడుతోందే నీ పయ్యెద నా ఎదన రచ్చ
మచ్చుకైనా చూపించవే నామీద నీకున్న ఇచ్ఛ
గిచ్చుతోంది నీ పోడిమి నా శీలానికి తెస్తూ మచ్చ
1.బంగారం రంగరించి శృంగారం బోధపర్చి
సృజించాడు సృష్టికర్త నిన్ను నా గురించి
రసకృతులు రతి కిటుకులు కడు నేర్పించి
నా ముందుంచాడు కుందనాల బొమ్మగ కూర్చి
2.నీ హావభావాలతొ నాలో పెల్లుబికే లావాలు
నీ కులుకులొలుకు పలుకులతో రసనస్రవాలు
మునిపంటితొ నొక్కిన పెదవి రేపేను ఉద్వేగాలు
క్రీగంటితొ విసిరిన శరము తీసేను నా ప్రాణాలు
No comments:
Post a Comment