Saturday, February 11, 2023

 https://youtu.be/P_iz-SKtS6k


రచన,స్వరకల్పన&గానం:డా గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:యమన్ కళ్యాణి


శివ కళ్యాణము విశ్వ కళ్యాణమే

శివరాత్రి వ్రతముతో జీవకైవల్యమే

కనరండి కనులారా శివభక్త జనులారా

తరించండి తిలకించి తనువుల తపనలార

ఓం నమః శివాయ,జయ శ్రీరామలింగేశ్వరాయ


1.శివరత్న క్షేత్రమౌ అయ్యంకి పవిత్ర ధాత్రిన

వరలుచున్నాడు ఇల మొరలాలకించుతూ

శ్రీరామలింగేశ్వరుడు గంగా పర్వతవర్ధినియుతుడు

శరణాగతవత్సలుడా శంభుడు భక్తవ శంకరుడు భక్త వశంకరుడు


2.గంగను భరించి భర్తగమారిన భవహరుడు

లింగోద్భవ ఘట్టాన హరి బ్రహ్మల కందనీ దురంధరుడు

చెంబుడు నీళ్ళకే సంబరపడు గంగాధరుడు

అంబరమును అంబరముగ మేన దాల్చె దిగంబరుడు


3.మతితప్పి గతిగానక సతికై దుఃఖించిన భవుడు

పార్వతినే తపమాచరించి వరించిన అర్ధనారీశ్వరుడు

శ్రుతి లయ తామై జగతినే మురిపించగా మా ఉమాధవులు

వధూవరులై పరిణయమాడిరి విధిగా భవానీ భార్గవులు

No comments: