https://youtu.be/zaqzzFbmAd4?si=J0Eoh1BByICul3qB
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
చిత్తరువైపోయాను నీ చిత్తరువునుగాంచి
మత్తులో కూరుకపోయాను నీ మధరగాత్ర మాస్వాదించి
భువికే అందాలు పెంచావే ఏదివ్యలోకాలనుండో ఏతెంచి
సలాంచేస్తానే మీ అమ్మానాన్నలకు నినుకన్నందుకు తలవంచి
1.నీకేశ సంపద నను నిలువున ముంచదా
కురుల వంకీ మోమున వాలి ఎదలయ పెంచదా
నిగారింపు బుగ్గలు చూసి నిమురాలనిపించదా
వన్నెలెన్నొ ఒనగూరిన నీమేను హరివిల్లును మించదా
ప్రణామాలివే మీ నాన్నకు నీవంటి సుందరికి జనకుడైనందుకు
2.ఇంద్రనీల మణులేనే దీపించే నీ కనులు
చంద్రకాంత సదృశాలు నీ అజిన జానులు
పొందికగా నీకమరింది అప్సరసల దేహసౌష్ఠవం
మంత్రముగ్దులవ జేస్తుంది నీ గాత్ర సౌరభం
వందనాలివే మీ అమ్మకు వాసిగ నిను కని ఇచ్చినందుకు
No comments:
Post a Comment