Monday, March 13, 2023

 


https://youtu.be/e__rTLxAcPI

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:లలిత

రాజేశ్వరా నటరాజేశ్వరా
రాజరాజేశ్వరా రాజేశ్వరీ వరా
రారా నన్నేలరా రాజశేఖరా
కైలాస శిఖరాలు కడచిరారా
కైవల్యమార్గాన నను నడపగరా
నందీవాహనమెక్కి వందీమాగధులగూడి
భృంగిశృంగి ఆదిగా సేవక జనములతోడి

1.క్రిమి కీటకాలకు పశుపక్ష్యాదులకు
దారిచూపినావు శివా మోక్షలోకాలకు
అజ్ఞాన భక్తులకు చోరశిఖమణులకు
అనుగ్రహించి చేర్చావు  అక్షరములకు
ఉత్కృష్టమే కదా నరజన్మ ఉద్ధరించరా
అదృష్టములేదా ఈజన్మకు అవధరించరా

2.దమనచిత్త దానవులను దయజూశావు
   భిల్లుడైన తిన్నడినీ నీ అక్కున జేర్చావు
బాలకులను సైతం బిరాన కాచావు
కిరాతావతారమెత్తి కిరీటినింక బ్రోచావు

నిరతము నీ ధ్యాన మగ్నుడనే కదా శంకరా
కనికరమున ననుగాంచగ నాకేదిక వంకరా

No comments: