రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
రాగం:ఆనంద భైరవి
పదునాల్గు భువనాలు పసిడి ఊయల చేసి
నాల్గు వేదాలను చేరులుగ సమకూర్చి
అందాల తొట్లొలో సుందరాంగా నిన్ను బజ్జుంచి
లాలిజోయనుచునూ ముదమార ఊపెదను
లాలిజో లాలిజో శ్రీ రఘు వంశతేజా
నీ బోసినవ్వులే హాయి యువరాజా
1.స్ఫూర్తినిచ్చెటి పేరునే నీ చెవిలొ చెప్పెదను
నినుగన్న అమ్మయూ నాన్నయూ ఒప్పగను
కీర్తితేవాలి నువు మునుముందు గొప్పగను
ప్రగతి నొందగ జగతి మలుపు తిప్పగను
2.తరచి తరచి నీకు తగు పేరును ఎంచి
బియ్యపు పళ్ళెంలో ఉంగరంతొ రాయించి
సంప్రదాయముగనూ నామకరణం జరిపించి
ఆనందమొందారు ఇంటిల్లిపాదీ తమ మేనుమరచి
3.బావిలోనుండి మీఅమ్మతో నీటినే చేదించి
నానిన శనగలను అచటి వారికంతా పంచి
వస్త్ర తాంబూలాలు వచ్చిన వనితలకునిచ్చి
జరిపిరి నీ బారసాలను కడువైభోగమొనరించి