షణ్ముఖ సోదర అయ్యప్పా సాష్టాంగ వందనం
స్వామి శరణంటూ నినుచేరవచ్చేమయ్యా
సచ్చిదానంద రూప సామగాన వందనం
భూతనాథునీ దివ్య విగ్రహం-సర్వమంగళం మదికి నిగ్రహం
మణికంఠునీ భవ్యవీక్షణం-మలయమారుతం పరమ పావనం
కరుణకురియు స్వామి చూపు-మంచు కన్న శీతలం
ప్రభలు చిలుకు స్వామి రూపు-అత్యంత సుందరం
స్వామి చిత్రమే ముగ్ద మోహనం-స్వామి తత్వమే మోక్ష కారకం
ప్రేమరూపాయ విమల చిత్తదాయకాయ
షణ్ముఖ సోదర అయ్యప్పా సాష్టాంగ వందనం
స్వామి శరణంటూ నినుచేరవచ్చేమయ్యా
సచ్చిదానంద రూప సామగాన వందనం
భూతనాథునీ దివ్య విగ్రహం-సర్వమంగళం మదికి నిగ్రహం
మణికంఠునీ భవ్యవీక్షణం-మలయమారుతం పరమ పావనం
వెతలు మాపు స్వామి చూపు- జ్య్తోత్స్నకన్న హాయి
అంధులకిల దారి చూపు-పరంజ్యోతి స్వామి
శబరిధాముని చిద్విలాసము-పాపహారకం పర సౌఖ్యదాయకం
ప్రేమరూపాయ విమల చిత్తదాయకాయ
షణ్ముఖ సోదర అయ్యప్పా సాష్టాంగ వందనం
స్వామి శరణంటూ నినుచేరవచ్చేమయ్యా
సచ్చిదానంద రూప సామగాన వందనం
భూతనాథునీ దివ్య విగ్రహం-సర్వమంగళం మదికి నిగ్రహం
మణికంఠునీ భవ్యవీక్షణం-మలయమారుతం పరమ పావనం
మత్తుమందు స్వామి చూపు- మదికి ఇంద్రజాలము
కనులవిందు స్వామి రూపు - మణుల ఇంద్ర నీలము
స్వామి నీడలో ఎద పారవశ్యము- అనుభవమ్ములో నమ్మశక్యము
ప్రేమరూపాయ విమల చిత్తదాయకాయ
షణ్ముఖ సోదర అయ్యప్పా సాష్టాంగ వందనం
స్వామి శరణంటూ నినుచేరవచ్చేమయ్యా
సచ్చిదానంద రూప సామగాన వందనం
భూతనాథునీ దివ్య విగ్రహం-సర్వమంగళం మదికి నిగ్రహం
మణికంఠునీ భవ్యవీక్షణం-మలయమారుతం పరమ పావనం
No comments:
Post a Comment