Friday, November 13, 2026

 

నాగలోక తొలి అధిపతిగా 

అనంత శయనుని తల్పముగా 

అలరారే ఆది శేషునిగా 

పాతాళ పాలక రారాజుగా నాగరాజుగా 

సాగరమథనంలో చిలికెడి తాడుగా 

పరమ శివుని మెడన హారమై వరలే వాసుకిగా 

నరులకు ప్రత్యక్షమయ్యే ప్రత్యేక ఆరాధ్యులుగా 

పూజాలందుకొంటుంది నాగజాతి

పూజాలందుకొంటుంది మీ నాగజాతి 

పరమ పవిత్రం నాగుల పంచమి నాగుల చవితి 

గైకొనరే మంగళ హారతి-కర్పూరమంగళ హారతి

గైకొనరే మంగళ హారతి-కర్పూరమంగళ హారతి 


1.సుబ్రహ్మణ్యుని అవతారముగా జనులకు శుభములు కూర్చి 

కాళహస్తి కథలోనూ హరుడిని కొలిచి పరమును బడసి 

సహస్ర ఫణముల సమస్త ధరణిని పదిలముగా తలనిలిపి 

దివ్యాస్త్రాలలో ప్రముఖము నాగాస్త్రమని పేరుమోసి 

నరులకు ప్రత్యక్షమయ్యే ప్రత్యేక ఆరాధ్యులుగా 

గైకొనరే మంగళ హారతి-కర్పూరమంగళ హారతి

గైకొనరే మంగళ హారతి-కర్పూరమంగళ హారతి 


2.విశేష శక్తులు కలిగి అశేష మహిమలు చూపి

మానవజాతి మనుగడలో విషముతొ రుజలను బాపి 

ఎలుకల బెడదను తొలగించగ రైతుల పాలిటి దైవమని 

భక్తితొ పుట్టలొ పాలు పోసి ఆర్చించే భక్తుల కృప గనమని 

నరులకు ప్రత్యక్షమయ్యే ప్రత్యేక ఆరాధ్యులుగా 

గైకొనరే మంగళ హారతి-కర్పూరమంగళ హారతి

గైకొనరే మంగళ హారతి-కర్పూరమంగళ హారతి

No comments: