Tuesday, April 21, 2009


చంచల మీ మానసము
కాదెపుడది నీ కైవసము
గుప్పిట చిక్కని పాదరసము
అక్కున జేర్చుట ఎవరి తరము 

1.చిరుగాలికే ఇది చిగురాకులా వణుకు
తొలి స్పర్శకే ఇది పులకింతలను చిలుకు
స్పందన దీనికి సహజాతి సహజము
చిందులు వేయుట దీని నైజము

2.వానరమై ఇది జీవనమెల్ల చెఱచు
ఊసరవెల్లిగ పలు వన్నెలు మార్చు
మంకుతనమే దీని గుణము
మూర్ఖత్వమే దీని తత్వము

No comments: