వెన్నెల కురిసే వేళ
నాచెలి రాలేదేల
నను మురిపించే బాల
1. గుసగుస లాడ పొద ఉంది
గుబులును దీర్చ ఎద ఉంది
నాచెలి రాలేదేల
నను మురిపించే బాల
2. కన్నులు కాయలు కాచే
క్షణమే యుగమై తోచే
నాచెలి రాలేదేల
నను మురిపించే బాల
3. చెలిలేనీ నిశీధి వృధా
చెలి సన్నిధినే కోరితిసదా
నా చెలి రాదేమీ వేళా
నాలోరేగే హిమజ్వాలా
2 comments:
which movie song is this ? if not, it would be great for a movie song !
ప్రియ నేస్తం! నా ఈ బ్లాగులలోని అన్ని పాటలు/గీతాలు/కవితలు/నానీలు(www.rakigita9-4u.blogspot.com) నా స్వీయ రచనలు
ఇప్పటివకు ఏ సినిమా లోను చోటు చేసుకోలేదు.వీటన్నింటికీ నేను స్వరపరచిన ట్యూన్లు ఉన్నాయి మీ ఆదరణకు నోచుకుంటే ఆ audio కూడ post చేస్తాను
Post a Comment