Sunday, July 12, 2009

అపజయమే నాకు నేస్తం
అవమానమే నాకు ప్రాణం
విషాదమే నా ముద్దుపేరు
ఆవేదనే నా పుట్టినూరు
1. ఆపదలు నా ఆప్త మిత్రులు
దారిద్ర్యం నా దగ్గరి చుట్టం
కన్నీళ్ళతో గాని తీరదు నా దాహం
రుధిరంతో నాకుపశమనం
2. వంచనే నాకు జనమిచ్చే బహుమానం
మౌనమే నేను పంచె అభిమానం
జీవితం నాకడుగడుగున ఒకరణం
శాశ్వతం నాకగత్యం మరణం

2 comments:

జీడిపప్పు said...

ఒక రిక్వెస్ట్. ఈ వార్త పైన ఒక కవిత వ్రాయగలరా?

Auto Prakash1
Auto Prakash2

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

మీరు కోరిన విధంగా నాకు తోచిన విధంగా కవిత తయారుగా ఉంది
19-07-2009 నాటి పోస్టింగ్ లు చూడండి భావాలు పంచుకోండి
సదా
మీ స్నేహాభిలాషి
రాఖీ