https://youtu.be/qUdqszjxY9o?si=01ZsqFigKKIDTsCf
నీ చిరునవ్వు కోసమే-నే పరితపిస్తున్నా
కడగంటి నీ చూపుకె నే కలవరిస్తున్నా
ఎవరెవరికొ నువ్విచ్చినంత-ప్రాధాన్యత కోరానా
ఇష్టపడే వారంటే-ఇంతి కింత నిరాదరణ నా
1. కడుపునిండ నువు తింటే-నా ఆకలి మటుమాయం
కళ్ళముందు కనబడితే-నా రుగ్మతలన్ని నయం
కాసింత స్పందిస్తేనే- ఉన్నమతి పోతుంది
రవ్వంత దయతలిస్తె-నా గుండె ఆగుతుంది
2. మనసార పలకరిస్తే-మాణిక్యాలెందుకు
క్షణమైన దృష్టి పెడితె-లక్షలు కోట్లెందుకు
నీ వద్దనుండి నేను- లాక్కున్న సొమ్మేంలేదు
నువ్వెంత దోచుకున్నా-కిమ్మని అననైన లేదు
3. నీచర్మం గీరుకపొయినా-నా ప్రాణం విలవిలా
నీకేచిన్న గాయమైనా-నాకు నరక ప్రాయంలా
నీ ప్రసన్నవదనమే- నా కిల బృందావనం
నువు చల్లగ వర్ధిల్లుటే- నా మనోభీష్టం
No comments:
Post a Comment