Monday, August 12, 2019

ఆకాశం నివ్వెరపోయింది-మన బంధం చూసి
భూలోకం విస్తుపోయింది-మన ప్రేమను చూసి
నింగిలోని చుక్కలన్ని బెంగపెట్టుకున్నాయి
చందమామ ఇంత ప్రేమ అందజేయలేదని
తోటలోని పువ్వులన్ని చిన్నబుచ్చుకున్నాయి
తేనెటీగ ఇంత ప్రేమ పంచనే పంచలేదని

1.చిలకా గోరింకలు సంభ్రమపడిపోయాయి
కనీవిని ఎన్నడెరుగని మన అనురాగం చూసి
కపోతాల జంట సైతం కన్నుకుట్టుకున్నది
నభూతోన భవిష్యతౌ మన అనుబంధం చూసి

2.రతీ మన్మథుల మతి పోయింది
అన్యోన్యం  తగు అర్థం మనలో కనుగొని 
రాధాకృష్ణుల తృష్ణ పెరిగింది
పెనవేసుకున్న ప్రణయభావం మనయందుగని

3.సిరిహరి ఎరుగరు... ప్రేమ తత్వమై
ఒకే దేహమై తమేవాహమై...........మనమున్నామని
హరుడు గౌరి గ్రహించలేరు అద్వైతత్వమె
పరమ తత్వముగ మనమూ మనగలుగుతున్నామని

No comments: