రాగం : రసమయ వేదమయి (3 notes only స రి గ)
లఘు రూప కవిత
చెప్పగలిగితేనె ఘనత
సాంధ్రీకృత భావుకత
గుండె గుండెతో జత
చెప్పగలిగితేనె ఘనత
సాంధ్రీకృత భావుకత
గుండె గుండెతో జత
ఇది లఘురూప "కవి'త" "ల'హరి"
మనది లఘు కవితా లహరి
1.పరిమాణం పిడికెడంత
అనుభూతులు విశ్వమంత
హృదయమే ఒకవింత
లఘురూప కవితకు
ఎదయే ప్రామాణికత
2.అర్థము అంతరార్థము
కదిలించెడి పరమార్థము
లఘుకవితకు మూలము
సూక్ష్మంలో మోక్షము
లఘుకవితా లక్ష్యము
3.ఏ పేరుతొ పిలిచినా
పద నిర్మితి ఏదైనా
పది తాకని పంక్తులు
మితిమీరని జటిలతలు
రసగుళికలు లఘుకవితలు
No comments:
Post a Comment