రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
కాలం అమృతకలశం
చేజార్చకు ఏ నిమిషం
నిరర్థకంగ కోల్పోతే బ్రతుకు విలువ శూన్యం
నిజం తెలుసుకోకుంటే అది ఎంతటి దైన్యం
1.సుఖం దుఃఖమంటూ వేరువేరు లేవు
దృక్పథం మార్చుకుంటె రాలేవవి నీ తెరువు
వేదనలో మోదములో ఆనందమె పొందేవు
అనుభవాలు ఏవైనా ఆస్వాదించేవు
2.అభద్రతే ప్రతిఒక్కరి ఆందోళన హేతువు
నేటికంటె రేపటికే ప్రాధాన్యతనిచ్చేవు
భవితకై వగచివగచి ప్రస్తుతాన్ని వదిలేవు
మనిషిగా జీవించూ చేరేవు దివిరేవు
కాలం అమృతకలశం
చేజార్చకు ఏ నిమిషం
నిరర్థకంగ కోల్పోతే బ్రతుకు విలువ శూన్యం
నిజం తెలుసుకోకుంటే అది ఎంతటి దైన్యం
1.సుఖం దుఃఖమంటూ వేరువేరు లేవు
దృక్పథం మార్చుకుంటె రాలేవవి నీ తెరువు
వేదనలో మోదములో ఆనందమె పొందేవు
అనుభవాలు ఏవైనా ఆస్వాదించేవు
2.అభద్రతే ప్రతిఒక్కరి ఆందోళన హేతువు
నేటికంటె రేపటికే ప్రాధాన్యతనిచ్చేవు
భవితకై వగచివగచి ప్రస్తుతాన్ని వదిలేవు
మనిషిగా జీవించూ చేరేవు దివిరేవు
No comments:
Post a Comment