https://youtu.be/8nuQ-SmUo-s
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
నీలి నీలి బాలగోపాలా మోహన నందలాలా
నీ లీలలు ఎన్నని కొనియాడుదు వందలా వేలా
నా కలములొ స్థిరపడి నీవే నుడువాలవి చాలా
నీ ధ్యాసలొ మునిగితేలి నేను పరవశించాలా
1.నాది మట్టిబుర్రే నీవు మన్ను తినగ
నీ బుల్లినోటిలోపడగ విశ్వగతిని చనగ
నీఅగడాలు సైచనైతి యశోదమ్మలానేను
నా గుండెరోలుకే బంధించెద స్వామి నిన్ను
2.పంచేద్రియాలు నావి పశుప్రవృత్తులు
అదిలించి మళ్ళించవేల సక్రమ మార్గాలు
గోవర్ధనగిరిని కాదు మోయగ నీ ఘనత
నా సంసారభారానికి ఇచ్చిచూడు చేయూత
No comments:
Post a Comment