Tuesday, September 29, 2020

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కనులు పలికె కవితలెన్నో

చూపు తెలిపె మమతలెన్నో

ప్రశాంత సరోవరం నీ వదనం

మనోజ్ఞ రసాలరసం నీ రూపం


1.ఊపిరాగిపోతోంది నిను చూస్తూఉంటే

చూడకుంటెనూ నా శ్వాస ఇక అడడంతే

కాలమెంతగడిచేనో నీపై కన్ను కదపలేకుంటే

అద్వితీయ అనుభూతికే నా ఎద లోనౌతుంటే


2.నవ్వుకు తావులు నీ మీన నయనాలో

దరహాసపు నెలవులు నీ మధుర అధరాలో

ముదముకు ముదల ఓ ముదితా నీ కపోలాలో

అంతస్మిత అంకం అందాల నీ చుబుకం కాబోలో

No comments: