https://youtu.be/pjZWgUKxH7c?si=oXF01aDtNMnM947o
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
రాగం : మోహన
చంచలవే చెలీనీవు ధనలక్ష్మిలా
సిగ్గరివేనీవు కరిమబ్బుచాటు శశిలా
తొంగిచూసి వెళతావు బెంగను కలిగించి
సెలికి తుర్రుమంటావు ఎదలయ పెంచి
1.మనసుని తాకేవు పిల్లతెమ్మెరవై
తపనల తీర్చేవు వాన తుంపరవై
ప్రణయవీణ మీటుతావు స్వరఝరివై
సరాగాల ముంచుతావు రసధునివై
2.కలగా మారేవు రెప్పపాటులో
కవితగ వెలిసేవు ఒక్క ఉదుటిలో
స్ఫూర్తివైతావు కవనార్తిని బాపగా
మూర్తివైతావు ఆరాధన చూపగా
No comments:
Post a Comment