https://youtu.be/zCx89pLTIlo?si=b-CD0r0XZzJr_an4
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
విద్వత్తు సదనం మేధస్సు
కళలకు నిలయం మనస్సు
బ్రతుకునకతి ముఖ్యం విద్యా వినోదం
నమోస్తుతే భారతీ నా కవి నీ ప్రసాదం
1.అక్షయమౌ అక్షరాలు నీ వరాలు
మధువొలికే పదాలు నీ పదాలు
సీతాకోకచిలుకలు మధుర భావ వీచికలు
తలపున నీ కదలికలే కవన సూచికలు
నమోస్తుతే భారతీ నాకీవే శరణాగతి
2.దేహచక్ర సప్తకమే సప్తస్వరాలు
ఆహ్లాద దాయకము అనురాగ రాగాలు
ఉల్లముకుల్లాసమే లయ విన్యాసాలు
సాయుజ్యాన్వితమె సంగీత గీతాలు
నమోస్తుతే భారతీ నీ దయతో సంప్రాప్తాలు
No comments:
Post a Comment