రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
కొంచం కొంచంగా ఎంతో నచ్చావు
నీ వాడిచూపులతో ఎదనే గుచ్చావు
సీదాసాధాగానే ఉన్నా నన్ను నన్నుగా మెచ్చావు
నిద్రాణమైన ప్రణయాన్ని ఉల్కిపడేలా గిచ్చావు
కోరికోరి వలచావు ప్రియా నా మనస్సునే గెలిచావు
1.చిరుబురులాడే కోపంలో నీమోము
ఎంతగా కందిపోయేనో చెప్పలేము
వెక్కిరించీ వేడెక్కించును నీ బుంగమూతి తీరు
ముద్దాడగలిగానా నిన్ను నా ఆశలన్నీ తీరు
కోరికోరి వలచావు ప్రియా నా మనస్సునే గెలిచావు
2.కావాలని నను కలవాలని నీకెందుకలా
నా ఒడిలో నువు వాలాలని ఏవేళా నా కలా
ఆవలించనీకుండా కావలించుకుంటుంటే అలకలా
చెదిరిపోని మనబంధం ఆదర్శమవనీ చిలకాగోరింకలా
కోరికోరి వలచావు ప్రియా నా మనస్సునే గెలిచావు
No comments:
Post a Comment