రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
శిరము నుండి దూకేను ఒక విషము
గళము నందు నిలిచేను ఒక విషము
విషయ వాంఛా రహితుడవు శివుడవు
విషమము నీతత్వము మాకు అర్థమే కావు
శంభోమహాదేవ కైవల్య దాయకా
సాంబసదాశివ శరణము నీవే ఇక
1.మునులెందరు నీకై తపమాచరించిరో
రావణాదులెందరు నీ వరములనందిరో
నందివాహన సచ్చిదానంద ధవళ మోహన
అమర వందిత గంగాధరా నమో పంచానన
శంభోమహాదేవ కైవల్య దాయకా
సాంబసదాశివ శరణము నీవే ఇక
2.ఏ స్థాణువైనా కనగ లింగ రూపమే
ఏ శబ్దమైనా నాకు ఓంకార నాదమే
భోళాశంకరుడవు శశాంకధరుడవు
సుజ్ఞాన వరదుడవు త్రిపురాసుర హరుడవు
శంభోమహాదేవ కైవల్య దాయకా
సాంబసదాశివ శరణము నీవే ఇక
No comments:
Post a Comment