రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
నీలాల మేఘాల నీ కేశాలు
వేసాయి నామదికి పాశాలు
గాలికి చెలరేగుతూ ఆసక్తే రేపుతూ
అలరించినాయి నీకందమిస్తూ
మురిపించినాయి నా ఎద దోస్తూ
1.కదలాడు మీనాలు నీ సోగనయనాలు
తీస్తాయి చూపులతో నా పంచప్రాణాలు
తాళజాలరెవ్వరు నీ తీక్షణ సుమ బాణాలు
నినుచూస్తూ బ్రతికితె చాలు నాలుగే క్షణాలు
2.భూమినైన మించిఉంది నీ ఆకర్షణ
ఎదురుగా నీవుంటే అంతర్గత ఘర్షణ
చెప్పలేను మానలేను అంతఃకరణ
నీ కరుణ గనకుంటే అది మరణ యాతన
No comments:
Post a Comment