ఏకపక్షమేనేమో నా ప్రేమ
నింగి కెగసే కెరటంలా ఆరాటంలా
నిర్లక్షమేనేమో నేనంటె నీకు ఓ భామ
గాలికి అంటే కంటకంలా సంకటంలా
1.బలవంతపు చర్యగా బదులు పలకడం
మొక్కుబడిగనే నువు స్పందించడం
చొరవన్నది ఏమాత్రం చూపించకుండటం
ఆసక్తిని కాస్తైనా ప్రకటించక పోవడం
ఎదుర్కొనే ఎదుటివారికెంతటి దుర్భరం
ప్రేమరాహిత్యమే ఇలలో రౌరవ నరకం
2.మెడకు పడ్డ పామల్లే ఏల భావించడం
పాదం పట్టు జలగలాగనా పరిగణించడం
దృక్పథమే సరికాదేమో ఈ వ్యతిరేక యోచనం
అంతర్మథనమే జరిగేనో నీలోన అనుక్షణం
త్రికరణశుద్ధిగా సాధ్యమే మనం స్నేహించడం
దోషమా నిజాయితీ బంధం నీతో ఆశించడం
No comments:
Post a Comment