https://youtu.be/6KfFhRue1as?si=MMmnwb9psInjCdMK
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
రాగం : నీలాంబరి
శుభరాత్రి నేస్తమా…
కొనసాగనీ మన చెలిమినీ…
నిదురించుమా మిత్రమా
నను నీ కలవనీ, కలలో నీతో కలవనీ…
కలకాస్తా నిజమవనీ
1.పగలంతా చెప్పుకున్న సుద్దులన్నీ సద్దుమణగనీ
స్వప్నమందైనను వదలని స్నేహం ముద్దుగొలపనీ
కనురెప్పనై కాపుకాస్తా నీకనుపాపను పొద్దూ మాపును
చేదోడు వాదోడై తీర్చిదిద్దుతా మధురంగా మనదైన రేపును
2.కష్టమే రాకపోనీ నీకు వస్తేగిస్తే నన్ను మరువబోకు
అదృష్టమే వేయనీ మారాకు ఎద పొంగిపోతుంది నాకు
నీ అడుగులు తడబడకుండా చేయిపట్టి నడిపిస్తా
నీ పదములు కందకుండా నా హృదయ తివాచి పరుస్తా
No comments:
Post a Comment