https://youtu.be/6t-BPLTzkJw
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
వర్షాకాలంలోనూ వన్నెల వసంతం విరిసింది
వానలు ముసిరినగానీ కన్నె కోయిల కూసింది
ఉల్లములో ఉప్పెనలా ఉద్వేగాలే ఉసిగొలుప
వలకాక వలపులతో వెల్లువలా పెల్లుబుక
1.ఒంటరి తానైతేమి ఈ తుంటరి లోకంలో
ఎందుకు మునిగుండాలీ పికము ఎప్పుడు శోకంలో
గున్నమావి కవిగామారి భావచివురులందిస్తుంది
ఎలుగెత్తీ గానంచేయగ ఎంతో పరవశిస్తుంది
2.పాట ఒకటి ఉంటేచాలు ప్రాణానికి సాంత్వన
ఆకలీ దప్పులు తీర్చును గాత్రామృతాస్వాదన
పంచభూతాలే శ్రోతలు పంచమాస్యా సదస్సున
శషభిషలు మానేసీ చెలఁగాలీ స్నేహ జగాన
No comments:
Post a Comment