కన్ను చెదిరేనే సన్నజాజి తీగవంటి నీ ఒంటి వంపులే చూసి
రెప్పలార్చనైతినే మెరుపుతీగ తెన్ను మేను జిలుగుకే భ్రమిసి
జీడితీగలోని తీపి నీ పెదాల సుధా మాధురి
సంతూర్ తీగలమ్రోగు తీపి నీ పలుకుల మాదిరి
1.కాంచనగంగా ప్రవాహంగ నీ తనువు తోచే
నీ అంగాంగం మోహనంగ సారంగమై పూచే
మదన కదనరంగాన శృంగార శృంగజమై వేచే
కందవాహనమే ఆవాహనమై నా మనమే నర్తించే
2.మితిమీరే రతి పదాల నిఘంటువులు నీ బిగువులు
మతి కోరే సమ్మతి తెలిపెడి చాటువులు నీ నగవులు
ప్రతినాయకి గతిసాగెడి కవ్వింపుల నీపయ్యెద పొతవులు
శ్రీమతిగా నిను గొనమని తథాస్తు దేవతల హితవులు
No comments:
Post a Comment