రచన్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:అమృత వర్షిణి
నను నడిపించరా నా అడుగులు తడబడె
చేయందించరా బ్రతుకు కడలి సుడిబడె
ఎందరిలోనో నేనొకడినని సందియమెంతో ఉండెడిది
అందరిలోను నినుగనినంత నా డెందమానంద మొందినది
1. కలివిడిగా నీవిచ్చినవే స్వామి నా కష్టసుఖాలు
ఇబ్బడిముబ్బడిగా ఎందుకు అందులొ కష్టం పాలు
నా లోపాలు పాపాలు కోపాలే కారణాలై ఈ శాపాలు
తాళజాలనీ పరితాపాలు తీర్చరా ప్రభూ భవతాపాలు
2.అన్నీ ప్రసాదించావు స్వామీ నాకు ఆఒక్కటి దప్ప
పరమదయాళా ప్రభో ఇదియేనా నీదైన గొప్ప
దయచేయి దయచేసి నాకినైన మనశ్శాంతి
నా హృదయాన దయచేసి వరమీయి నివృత్తి
No comments:
Post a Comment