https://youtu.be/RaBtjtsSI-4?si=hTtX54J7uX-YdNvl
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
రాగం:మాండు
ప్రతి నిత్యం దీపావళే నా ఇంట నువ్వుంటే
బ్రతుకంతా సౌదామినే నాకంట కొలువుంటే
నీ కన్నులు మతాబులు నీ నవ్వులు తారాజువ్వలు
మిసమిసలతొ తిరుగాడితే వెలుగు వెన్నెల తీగలు
రుసరుసగా మాటలు రువ్వితె అవ్వే సీమటపాసులు
1.దుబారా నరకుని దునుమాడె సత్యభామవే
గుట్టుగ ఖర్చులు నెట్టుకవచ్చే విజయలక్ష్మి వే
నీ నడకలు భూచక్రాలు నీ ఆజ్ఞలు లక్ష్మీ బాంబులు
చెరగని నవ్వుల సంపదలొసగే ధనలక్ష్మి నీవే
పండుగ సందడి నిండుగ నిలిపే వైభవలక్ష్మివే
2.ఆనందాల అతిథుల కళ్ళే వెలిగే దివ్వెలు
తృప్తితొ అభ్యాగతులిచ్చే దీవెనలే రవ్వలు
మువ్వల సవ్వడి వాద్యాలు గాజుల సడి మంత్రాలు
తీరగు రుచులతొ కమ్మని విందిడు ధాన్యలక్ష్మివే
గుండెలొ దండిగ కొలువై ఉండెడి నా గృహలక్ష్మివే
No comments:
Post a Comment