రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
ఔను నిజం ఔను నిజం
నా ఊహే నీవై వెలిసావన్నది నిజంగా నిజం
వలపు నిజం తలపు నిజం
నా మనసే నీదన్నది నీవెరుగని అసలు నిజం
1.కొలను నిజం కలువ నిజం
జాబిల్లిని కన్నంత మురియుట నిజం విరియుట నిజం
మబ్బు నిజం గాలి నిజం
గాలి తనని తాకినంత కరుగుట నిజం కురియుట నిజం
2.వెదురు నిజం పెదవి నిజం
మోవి స్పర్శతో నే పిల్లన గ్రోవై మ్రోగుటే తీపినిజం
నా రాధవె నీవునిజం నీ బాధయు నిజం నిజం
మనసంగమ ప్రతిసమయం రసమయమగునన్నదే కదా నిజం
3.నీవు నిజం నేను నిజం
ఒకరిలో ఒకరున్నది మనమొకరికి ఒకరన్నది నిజం
నీ అందం నిజం మన బంధం నిజం
నీతో జీవిత బంధమే అనునిత్యం ఆనందమన్నది పరమ నిజం
No comments:
Post a Comment