https://youtu.be/Ux_KTX6Tsk8
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
పసిడి పంజరాన నే రామచిలుకను
ఎలా ఎగిరొచ్చి నీపై ప్రేమ చిలుకను
ఎదగనీ ఎదలోనే అనురాగ'మొలకను
ప్రేమికా మన్నించు నిరంతరం నిను కోరే ఈ ప్రేమికను
1.నీ మురళి పలికించే మంజుల రవళిని
వినినంతనె మేనుమరచి నర్తించే నెమలిని
ఏజన్మలోనో నీతోనే నడచిన నీ ఆలిని
ఈ బ్రతుకున కేవలం నీకు ప్రియురాలిని
ప్రేమికా అర్పించా నీకే నా మానస సంచికని
2.నీ ముందు వాలుతాను కాస్త సమయం చిక్కితే
నీ దానిగ మారుతాను అవకాశమంటూ దొరికితే
నా బ్రతుకు అద్దాల సౌధం పగులుతుంది రాయి రువ్వితే
మనదైన మధర స్వప్నం కరుగుతుంది అలజడిని రేపితే
ప్రేమికా దాచుకుంటా మన కలయిల జ్ఞాపికని
No comments:
Post a Comment