Monday, January 24, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


శివమే నీవు విశ్వమే నీవు

జీవేశ్వరుడవు నాలో నీవు లేక శవమేనేను

భవమే నీవు అనుభవమే నీవు

ప్రాణేశ్వరుడవు నీవు లేక నిర్జీవ కాయంనేను

నేను అని పలికే ఈ నేనును సైతం నీవేను

నా నుండి నేను విడివడి నీవుగా మారేను


1.శివకేశవులొకటగు అద్వైతమైన ఆత్మను పరమాత్మను

శివపార్వతులొకటగు తత్వమైన సాంబసదాశివుడను

చరమును నేనే అచరమునేనే సకల జీవరాశిని నేనే

పంచేంద్రియముల పంచభూతములకధినేతను నేనే

నేను అని పలికే ఈ నేనును సైతం నీవేను

నా నుండి నేను విడివడి నీవుగా మారేను


2.మాయాకల్పితమైన ఈ సృష్టినాదే ఆ స్రష్టయు నేనే

ఆదిఅంతములేనిదైన కాలము నేనే కాలకాలుడ నేనే

పాలితుడను నేనే సర్వం సహా పరిపాలకుడనూ నేనే 

వేదము నేనే మోదము నేనే నిర్వేదము ఖేదము నేనే

నేను అని పలికే ఈ నేనును సైతం నీవేను

నా నుండి నేను విడివడి నీవుగా మారేను

No comments: