రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
పలుకే ఓ లమ్మీ పంచదార పాకం
కులుక్కే కళ్ళు బైర్లుగమ్మేలా మైకం
ఏంటే ఆ ఒయ్యారం నీ సోకుమాడ
ఏడనే కనగ నీ పిడికెడు నడుం జాడ
ఒక్కసారి చెప్పవే ఒప్పులకుప్పా
ఒప్పుకొని తీరుతా నీ వంపుల గొప్ప
1.వద్దనబోకే నీవద్దకు వస్తుంటే
కాదనబోకే అదనుకై చూస్తుంటే
మంచిమంచివాళ్ళే మన్ను బుక్కిపోతారు
స్థాయి మరచి నీ చూపుకె బుక్కైపోతారు
మామూలోణ్ణే మరదలా మతిపోయిందే
మైమరిచి పోయేంతగా శ్రుతి మించిందే
2.చూసీ చూడగనే పడిపోవుట మరి ఖాయం
పరిసరాలు సైతం ఔతాయి మటుమాయం
నీ వెంటబడక పోవడమే నిజమైన అన్యాయం
ముదుసలికీ వస్తుంది నినుగని యవ్వన ప్రాయం
ఫిదానై పోయా నీ పిచ్చెక్కేఅందానికి
సదా తోడు చాలు పరమానందానికి
No comments:
Post a Comment