Thursday, May 19, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తలుపు తట్టిరాదా అదృష్టమంటు వస్తే

తల్లీ శ్రీవల్లీ ఘన ఘనమౌ నీ దయ వర్షిస్తే

తహతహలాడినా తపనలనే బడసినా

సిరీ హరిదేవేరి వృధాయే నీవే హూంకరిస్తే

పద్మాలయ ప్రపద్యే నారాయణి నమస్తే


1.భాగ్యమంటె సంపదకాదు ఆరోగ్యమే

సౌఖ్యమంటె విలాసమవదు వైరాగ్యమే

అష్టైశ్వర్యాలున్నా తృప్తినీయకున్న బ్రతుకు దైన్యమే

నవ నిధులున్నా నీ కృపలేనిది శాంతి మృగ్యమే

పద్మాలయ ప్రపద్యే నారాయణి నమస్తే


2.ఆస్తిపాస్తులెందుకు నిత్యానందిని కానీ

పదవులు వలదమ్మా పరమానందమెందనీ

రాగద్వేషాలనొదిలి నీ పదముల నందనీ

భవబంధాలు సడలి నీకే నీకే నన్నిక చెందనీ

పద్మాలయ ప్రపద్యే నారాయణి నమస్తే

No comments: