Thursday, August 18, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వెన్నెలంటి చల్లనినీ వీక్షణం

గుండెలో గుచ్చేంత తీక్షణం

కొక్కానికి చిక్కడమే ప్రేమలక్షణం

నువ్వనుమతించు వరకు నిరీక్షణే క్షణక్షణం


1.తలదాల్చిన ఆ విరులే

నా ఎదరేపెను ఆవిరులే

చెలరేగెను మరిమరి మరులే

నివేదించగా నీకవి సోమరులే


2.సృష్టించిన విధే నిను వరించగా

ఉచితముగాతని వాణీ నిలువరించగా

ఎంచి ఎంచి నాకే నిను బహుకరించగా

ఈ జన్మకిదిచాలని మదియె పులకరించెగా

No comments: