https://youtu.be/9uaaq1vM2UI?si=tEuIyKHnLfDjO-UT
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:మధ్యమావతి
కైలాసనిలయ కైవల్యదాయా
ఓం నమఃశివాయ
కారుణ్య హృదయ బ్రతుకే నీదయ
ఓం నమఃశివాయ
1.నీభక్తులకు భోలా శంకరుడవు
దుష్టశక్తులకైతే కాల రుద్రుడవు
నిను నమ్మితి కావరా నీలకంఠుడా
గణపతి ప్రజాపతీ ధవళ దేహుడా
2.దోసెడు నీళ్ళకే పరవశమవుతావు
బిల్వపత్రమర్పిస్తే మా వశమౌతావు
శరణు శరణు శంభో మహాదేవా
శరవణభవ శాస్తా సాంబశివా
No comments:
Post a Comment