https://youtu.be/T4TpWmpyoS4
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
రాగం:మిశ్ర భైరవి
సడలనీ ముడివడిపోయిన బంధాలు
తెగిపడనీ నను పెనవేసిన బంధనాలు
సాగనీ ప్రభూ నీవైపుగానే నా చరణాలు
ఆగనీ ఈ జీవికికనైన జనన మరణాలు
1.వెదికితినీ నిను కొండల కోనల
కాంచగ పదపడితి గుడి గుండాల
తిరిగితి యాత్రల మునిగితి నదుల
మరచితి నీ ఉనికినీ హృదయాన
2.మళ్ళించు నను అంతర్ముఖునిగ
భావించు స్వామీ నీ ప్రియ సఖునిగ
తరియించనీ నను చిదానంద సుఖునిగ
జీవించనీ విషయ వాంఛా విముఖునిగ
No comments:
Post a Comment