Monday, December 19, 2022

 https://youtu.be/UtB6oxI59fw?si=RQ4HOESefvcrc1uC


25) గోదాదేవి ఇరవై ఐదవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం

దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:రేవతి


అష్టమ గర్భాన అష్టమీ తిథి రోజున

జన్మించినావు దేవకీదేవికి చెఱసాలన

చేరినావు కృష్ణా యశోదానందుల గృహము నందున

గోలలే చేసినావు లీలలే చూపినావు (వారి) భాగ్య వశమున


1.మేనమామ కంసుని నిను దునిమే యోచనని

వమ్ము చేసినావు దమ్ముచూపినావు దుమ్మురేపినావు

మీ తలిదండ్రుల ఖైదు చేసిన మథురాధీశుని గని

రొమ్ము చరిచినావు నేలకూల్చినావు చంపివేసినావు


2ఎన్నని కొనియాడదము నీ లీలని యదుభూషణా

నిన్నే శరణంటిమి బ్రోవగ మాపై ప్రేమగొన్న శ్రీ కృష్ణా

కోరివచ్చినాము వరమీయవయ్య మాకు పురుషార్థాలను

దయచేయవయ్యా మేము చేసెడి వ్రత పరమార్థమిలను

No comments: