https://youtu.be/vks0TmaMk1Y?si=cZYuhJbFyTQu3NeV
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
ఉండునా తండ్రీ -పుండరీకాక్షా - జనులకీ ఇలను/
దండించగా నరకములు- ఇహపరమ్ములనూ- రెండు మెండుగను/
దాటవలెనేమో-వైతరణి మేము-బడయగా రౌరవాదులను/
కడచుటెటులో- తిరుమలేశా- జరా మరణాలను- దీర్ఘ వ్యా ధులను
1.రక్తపోటులు- గుండె పోటులు- కాలనాగుల కాటులు/
మధుమేహవ్యాధులు- పలురాచవ్రణములు -అవి కత్తివేటులు/
నలతలెన్నో- కలతలేన్నో -తట్టుకోజాలని తలపోటులు/
ఏనాడు ఏతీరు -సలిపితిమొ కడు తీవ్ర దోషాలు- పొరపాటులూ
2.సంతోషమన్నది-కలనైనఎరుగని-మా మోడు బ్రతుకులు/
ఉల్లాసమన్నది-ఊసైన కనలేని-దినదినపు గతుకులు/
ఎన్ని ఉన్నాగాని -అనుభవమ్మేలేని-నిరర్థక జీవితాలు/
ముంచననన్నా ముంచు-మంచిగా బ్రతికించు- ఏదైననూ మాకు మేలు
No comments:
Post a Comment