Thursday, November 19, 2026

 

రాగం: శహన

పల్లవి

పందళ బాలుడు వెడలెను నాడు పాల కొరకు
అడవుల వెంబడి నడిచెను స్వామి పులి పాల కొరకు
తల్లి శిరోవేదన బాపే ఔషధ పాలను తెచ్చుటే విధిగా సాగి
విల్లాలి వీరుడై వీరమణికంఠుడు వనములకేగి
పాలిచ్చే పులినే ఎక్కి వచ్చి వన్ పులివాహనుడాయే స్వామి
మాలధారుల ప్రేమతో బ్రోచే మణికంఠునికీ మనసా వచసా స్మరామి
మాలధారుల ప్రేమతో బ్రోచే మణికంఠునికీ నమో నమామి

స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం స్వామి శరణం మణికంఠ శరణం

చరణం 1

దారి సరంజామాలో వస్త్రపు ఇరుముడి ఒక భాగమై
పాకానుకూల దినుసులు టెంకాయలు చెరిసగమై
ఇరువైపుల సరితూగు విధి ముడి విడదీయు యుగమై
తొలిసారి ఇరుముడి మోసిన అయ్యప్ప స్వాముల యోగమై
మాలధారులను ప్రేమతో బ్రోచే మణికంఠునికీ మనసా వచసా స్మరామి
మాలధారులను ప్రేమతో బ్రోచే మణికంఠునికీ నమో నమామి

స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం స్వామి శరణం మణికంఠ శరణం

చరణం 2

స్వామి దివ్య పదములు కదలాడిన పావన మార్గం పెద్దపాదం
స్వామి శరణుఘోషయే దీక్షాపరులకు నిత్య పారాయణ వేదం
అళుదా కరిమల నీలిమల అప్పాచిలతో శబరిమల పంచగిరుల ధామం
హరిహరసుతుడగు అయ్యప్ప స్వామి విలసిల్లే పవిత్ర సన్నిధానం
మాలధారులను ప్రేమతో బ్రోచే మణికంఠునికీ మనసా వచసా స్మరామి
మాలధారులను ప్రేమతో బ్రోచే మణికంఠునికీ నమో నమామి

స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం స్వామి శరణం మణికంఠ శరణం

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్పా!

No comments: