రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
దీపం దైవానికి ప్రతిరూపం
దీపం లోకానికి గురు తుల్యం
దీపం ప్రగతికి ప్రతిబింబం
దీపం సుగతికి ఒక గమ్యం
జ్ఞాన దీపం వెలిగించు-అనురాగ దీప్తిని పంచు
ఆత్మజ్యోతిని ప్రభవిస్తూ-సమైక్య గీతిని వినిపించు
1.పట్టపగలైనా గాని -పగలు కమ్మె చీకటులై
వెన్నెలే కురిసినగాని- విద్వేషం చిమ్మె కరిమబ్బై
విచక్షణే తేజరిల్లితే -విభేదం మోకరిల్లదా
మానవత్వ కాంతిలోనా- విశ్వశాంతి వెల్లివిరియదా

2.లౌకికత అన్నదే- ప్రపంచాన మన ఘనత
అనాదిగా పరమత సహనం- మన దివ్య చరిత
నరజాతికి పరమ విరోధి -కరోనా మహమ్మారి
మట్టుబెట్టి చితిపేర్చేద్దాం -ఒక్కతాటిపైన చేరి

https://youtu.be/KojzywMe_L8
https://youtu.be/hA6YW6X6YzY

No comments:
Post a Comment