రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:అమృత వర్షిణి
యతులకైన మతిచలించు
మునుల దీక్షనే ముంచు
ఋషులైనా పరవశించు
యోగుల భోగులగావించు
నీ అందానికి వందనాలు వన్నెల సుందరీ
నీ పరువానికి ప్రణామాలు సొగసుల మంజరీ
1.కలములనే కదిలించు
కుంచెలైన పులకించు
ఉలులింక ఉరకలెత్తు
అందెలు ఆరాటమొందు
నీ అందం బంధించగ వన్నెల సుందరీ
నీ పొంకం ప్రకటించగ సొగసుల మంజరీ
2.కుర్రకారు వెర్రెక్కు
దంపతుల కొంపముంచు
ముదుసలికే కసిరేపు
ముదితలైన మోహించు
నీ చక్కదనం అతి మిక్కిలి వన్నెల సుందరీ
నీ రూపం ఎదతాపం సొగసుల మంజరీ
No comments:
Post a Comment