రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ
అన్నం పరబ్రహ్మ స్వరూపం
అన్నమో రామచంద్ర అని ఘోషిస్తోంది నిరుపేద ప్రపంచం
ఆకలి ప్రేగుల నులిమేస్తుంటే
పట్టెడుమెతుకులకై పాట్లెన్నొ పడుతోంది కడు దయనీయం
1.తలదాచుకోనడానికి పంచనేది దొరకక
కడుపుకింత తినడానికి మట్టికంచమూ లేక
కునుకైన తీయుటకొక కుక్కిమంచమూ నోచక
బ్రతుకొక శాపంగా భవిత ప్రశ్నార్థకంగా
దినదినగండం నూరేళ్ళ ఆయువుగా
కూడూ గూడూ లేని జనం గోడు వెళ్ళగ్రక్కుతోంది
2.తింటే అరగని రోగం వండి వృధాపర్చు వైనం
విందూవినోదాల్లో విచ్చలవిడి పదార్థాల వ్యర్థం
జనం విదిలించు తాలు నిలుపునెన్నొ జీవితాలు
అదుపు చేయు విలాసాలు ఏర్పరచును విలాసాలు
అందించే చేయూతలు మార్చగలుగు తలరాతలు
మనిషి కొరకు మనసుపెడితె మనిషిలో ఋషిత్వాలు
No comments:
Post a Comment