రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
పాలకడలి మథనాన క్షీరజ నీవై
మానస సరోవరాన నీరజ రూపై
ఆవిర్భవించితీవు నేడే నా అర్ధాంగి గీతా
పరిణమించె పరవశాన నిను గని అవని నిజ పునీత
శుభాకాంక్షలందుకో సౌకుమార్య మాధుర్యా
శుభాశీస్సులివిగో హృదయ ఔదార్యా
హ్యాపీ బర్త్ డే టూయూ మై డియర్ గీతా
విష్యూ హ్యాపీ బర్త్ డే టూయూ నా ఎదవిజేత
1.మందహాసమే మణిహారం
మధుర భాషణే సుధారసం
దయార్ద్రమౌ వీక్షణే పూర్ణిమ శరత్తు
కపోలాల తీక్షణే గులాబీ తటిత్తు
ఎంత శ్రద్ధ కనబరచాడో నీ సృజనలొ బ్రహ్మ
చక్కగా ముడిపెట్టాడు ఈ రాఖీ తో నీ జన్మ
శుభాకాంక్షలందుకో సౌకుమార్య మాధుర్యా
శుభాశీస్సులివిగో హృదయ ఔదార్యా
హ్యాపీ బర్త్ డే టూయూ మై డియర్ గీతా
విష్యూ హ్యాపీ బర్త్ డే టూయూ నా ఎదవిజేత
2.విరులకున్న సౌందర్యం నీ సొత్తు
మరులతో చేస్తావు చిత్తాలనే చిత్తు
గాత్రానికి చేయాలి న్యాయం కించిత్తు
ఆపత్తులొ సంపత్తులో వీడబోకు నా పొత్తు
సౌశీల్యం సౌహార్ద్రం సమపాళ్ళుగ నీకు సంపద
శతమానం భవతిగ వర్ధిల్లు ఆదర్శమూర్తివై సదా
శుభాకాంక్షలందుకో సౌకుమార్య మాధుర్యా
పాలకడలి మథనాన క్షీరజ నీవై
మానస సరోవరాన నీరజ రూపై
ఆవిర్భవించితీవు నేడే నా అర్ధాంగి గీతా
పరిణమించె పరవశాన నిను గని అవని నిజ పునీత
శుభాకాంక్షలందుకో సౌకుమార్య మాధుర్యా
శుభాశీస్సులివిగో హృదయ ఔదార్యా
హ్యాపీ బర్త్ డే టూయూ మై డియర్ గీతా
విష్యూ హ్యాపీ బర్త్ డే టూయూ నా ఎదవిజేత
1.మందహాసమే మణిహారం
మధుర భాషణే సుధారసం
దయార్ద్రమౌ వీక్షణే పూర్ణిమ శరత్తు
కపోలాల తీక్షణే గులాబీ తటిత్తు
ఎంత శ్రద్ధ కనబరచాడో నీ సృజనలొ బ్రహ్మ
చక్కగా ముడిపెట్టాడు ఈ రాఖీ తో నీ జన్మ
శుభాకాంక్షలందుకో సౌకుమార్య మాధుర్యా
శుభాశీస్సులివిగో హృదయ ఔదార్యా
హ్యాపీ బర్త్ డే టూయూ మై డియర్ గీతా
విష్యూ హ్యాపీ బర్త్ డే టూయూ నా ఎదవిజేత
2.విరులకున్న సౌందర్యం నీ సొత్తు
మరులతో చేస్తావు చిత్తాలనే చిత్తు
గాత్రానికి చేయాలి న్యాయం కించిత్తు
ఆపత్తులొ సంపత్తులో వీడబోకు నా పొత్తు
సౌశీల్యం సౌహార్ద్రం సమపాళ్ళుగ నీకు సంపద
శతమానం భవతిగ వర్ధిల్లు ఆదర్శమూర్తివై సదా
శుభాకాంక్షలందుకో సౌకుమార్య మాధుర్యా
శుభాశీస్సులివిగో హృదయ ఔదార్యా
హ్యాపీ బర్త్ డే టూయూ మై డియర్ గీతా
విష్యూ హ్యాపీ బర్త్ డే టూయూ నా ఎదవిజేత
No comments:
Post a Comment