రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
ఉత్త వెర్రిబాగులదీ ప్రతి ఒక్కరి అమ్మ
పచ్చిఅబద్దాలకోరె ప్రతివారి నాన్న
ఏలా బ్రతుకుతారో ఈ మాయ లోకానా
కన్నవారి ఆసరా కరువై వృద్ధాప్యాన
1.అందని చందమామనద్దంలో చూపింది
ఉప్పునెయ్యి అన్నాన్ని అమృతం చేసింది
లల్లాయి పాటల్లో గాంధర్వం వంపింది
కడుపుతీపి మైకంలో కడగళ్ళను మరిచింది
2.అరకొర సంపాదన అద్భుతదీపమైంది
దొరకాల్సిన అప్పెప్పుడు రేపటికే పుట్టింది
ప్రతి వచ్చే పండక్కే నాన్నకు కొత్తదుస్తులు
చెరిగిపోదు నాన్న నవ్వు కరిగినా ఆస్తులు
No comments:
Post a Comment